MLC Kavitha In Delhi Liquor Scam LIVE : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు..(లైవ్)

Updated on: Nov 30, 2022 | 8:55 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ..  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది.  రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్‌ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది.రూ. వంద కోట్లు అరేంజ్‌ చేసినవారిలో.. కవిత, ఎంపీ మాగుంట పేరు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. పది సెల్‌ఫోన్లను డ్యామేజ్‌ చేసినట్టు.. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.కాగా, అమిత్‌ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈడీ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చడం హాట్‌ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్‌ ఎపిసోడ్‌లో సౌత్ గ్రూప్‌ వంద కోట్ల ముడుపులు చెల్లించింది. వంద కోట్ల సమకూర్చిన వారిలో కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Nov 30, 2022 08:55 PM