AP News: త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయం -గంటా శ్రీనివాస్
తాము గేట్లు గెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని గంటా శ్రీనివాసరావు కామెంట్ చేశారు. జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. కేవలం కార్పొరేటర్లే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
వైసీపీ తర్వలోనే ఖాళీ అవుతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖ కార్పొరేటర్లతోనే టీడీపీలో చేరికలు ఆగవని.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా టీడీపీలో చేరుతారని గంటా శ్రీనివాస్ చెప్పారు. పార్టీ అధినేత జగన్ తీరుతోనే వైసీపీ అనే నావ మునిగిపోయిందని ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కూడా జగన్ తీరు మారలేదని గంటా స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 21, 2024 08:34 PM