Watch Video: కేంద్ర మంత్రిగా నా తొలి లక్ష్యం అదే.. రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

|

Jun 11, 2024 | 3:03 PM

ఏపీలో ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి కృషి చేస్తా అంటున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ పనులను జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తామంటున్న మంత్రి.. అక్కడ ఫ్లైట్ ఎగరడమే తన తొలి లక్ష్యమంటున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలను ప్రధాని మోదీ ఏరి కోరి తనకు అప్పగించారని చెప్పారు.

ఏపీలో ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి కృషి చేస్తా అంటున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ పనులను జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తామంటున్న మంత్రి.. అక్కడ ఫ్లైట్ ఎగరడమే తన తొలి లక్ష్యమంటున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలను ప్రధాని మోదీ ఏరి కోరి తనకు అప్పగించారని చెప్పారు. తనపై మోదీ ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో పౌర విమానయాన శాఖ పాత్ర చాలా ఉందన్నారు. యువకుడివి, విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది.. కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుందన్నారు. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానని చెప్పారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పని చేస్తానన్నారు.

వైయస్సార్సీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వాస్తవ పరిస్థితిలో అది సాధ్యపడదని.. కానీ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చన్నారు. అత్యంత చిన్న వయసు క్యాబినెట్ మంత్రిగా అందరి దృష్టి తనపై ఉంటుందని.. దానికి తగ్గట్టే వ్యవహరిస్తానన్నారు.