కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం.. బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్‌

Updated on: Oct 18, 2023 | 12:50 PM

Telangana Elections 2023: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై ప్రసంగిస్తూ.. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.

కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై ప్రసంగిస్తూ.. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కరీంనగర్‌ ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని చెప్పుకొచ్చారు. రూ.3వేల పెన్షన్.. రూ. 5వేలు కాబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధును తీసుకొచ్చాం. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగలేదని కేటీఆర్ తెలిపారు. సెంటిమెంట్‌తో ఎంపీగా గెలిచి బండి సంజయ్‌ ఏం సాధించారని ప్రశ్నించారు.

Published on: Oct 18, 2023 12:43 PM