పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్.. బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానం

Updated on: Oct 14, 2023 | 3:25 PM

45 ఏళ్లు పనిచేసిన నాయకులకు కూడా కాంగ్రెస్‌లో అవమానాలు ఎదురవుతున్నాయన్నారు కేటీఆర్. తెలంగాణ చీఫ్‌ను అందరూ చీదరించుకుంటున్నారని.. ఆయన డబ్బు సంచులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జనగామ టికెట్‌పై కేసీఆర్‌ను కలిశాక ఆయనే స్వయంగా చెబుతారన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి.. గౌరవం, ప్రాధాన్యం ఇస్తామన్నారు కేటీఆర్.

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సైతం పొన్నాల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేటీఆర్. 16న జనగామ సభలో బీఆర్‌ఎస్ చేరమని పొన్నాలను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. పొన్నాల అందుకు సానుకూలంగా స్పందించారని.. ఆదివారం కేసీఆర్‌తో లక్ష్మయ్య భేటీ అవుతారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేసిన పొన్నాలను ఆ పార్టీ చీఫ్ తూలనాడారని కేటీఆర్ పేర్కొన్నారు. 45 ఏళ్లు పనిచేసిన నాయకులకు కూడా కాంగ్రెస్‌లో అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ చీఫ్‌ను అందరూ చీదరించుకుంటున్నారని.. ఆయన డబ్బు సంచులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జనగామ టికెట్‌పై కేసీఆర్‌ను కలిశాక ఆయనే స్వయంగా చెబుతారన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి.. గౌరవం, ప్రాధాన్యం ఇస్తామన్నారు కేటీఆర్.

కాంగ్రెస్‌తో పొన్నాలకు 40 ఏళ్లకు పైగా సుధీర్ఘ అనుబంధం ఉంది. వైఎస్సార్ హయాంలో మంత్రిగా కీలక శాఖలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణకు తొలి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ప్రస్తుతం జనగామ టికెట్ ఆయనకు కేటాయించే అవకాశం లేకపోవడంతో.. బీసీ నేతలతో ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆఖరికి పార్టీకి గుడ్ బై చెప్పారు.

కాగా కాంగ్రెస్‌కు రాసిన  రాజీనామా లేఖలో పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో వ్యక్తి స్వామ్యం అమలు అవుతుందని.. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వ్యూహకర్త సర్వే రిపోర్ట్‌లు ఇస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని పేర్కొన్నారు. బజార్లో గొడ్డును అమ్మినట్టు టికెట్లు అమ్ముకుంటున్నారని ఘాటు ఆరోపణలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Oct 14, 2023 02:25 PM