Watch Video: అసదుద్దీన్ ఫిట్‎నెస్ చూస్తే ఔరా అనాల్సిందే.. వైరల్ వీడియో..

| Edited By: Srikar T

Mar 08, 2024 | 9:23 PM

అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ముస్లీం సామాజికవర్గ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో గళాన్ని వినిపిస్తారు. పార్లమెంట్‎లో మైనార్టీ హక్కుల కోసం గట్టిగా పోరాటం చేశారు. కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతూ వాటికి వ్యతిరేకంగా అనేక సార్లు తన భావనను వ్యక్తం చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు అసదుద్దీన్.

అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ముస్లీం సామాజికవర్గ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో గళాన్ని వినిపిస్తారు. పార్లమెంట్‎లో మైనార్టీ హక్కుల కోసం గట్టిగా పోరాటం చేశారు. కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతూ వాటికి వ్యతిరేకంగా అనేక సార్లు తన భావనను వ్యక్తం చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు అసదుద్దీన్. అలాగే తన నియోజకవర్గ ప్రజలతో అప్పుడప్పుడూ మాటా మంతి నిర్వహిస్తూ ఉంటారు. సరదాగా బుల్లల్ బండిపై ఓల్డ్ సిటీ పురవీధుల్లో తిరుగుతూ తన పార్టీ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి ఎవరూ ఊహించని ఫీట్లతో కనిపించి అందరినీ షాక్ కి గురిచేశారు.

ఒక ఫిట్ నెస్ సెంటర్లో బలమైన డంబెల్స్ ఎత్తుతూ వ్యాయామం చేశారు. వయసుపైబడినప్పటికీ తాను ఎంత ఫిట్ గా ఉన్నానో నిరూపించుకుంటూ అనేక రకాల ఎక్సర్సైజ్లను చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఔరా అని నోరెళ్లబెడుతున్నారు. వ్యాయామం చేస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నారో చెప్పకనే చెప్పారు ఎంఐఎం అధినేత ఓవైసీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..