KTR: దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి.. కేసీఆర్‌ వస్తే ఇక ఈ సర్కార్‌ పరిస్థితేంటి..? కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..

|

Nov 14, 2024 | 9:09 PM

దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి.. రైతుల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళ్తా.. మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేసీఆర్‌ వస్తే ఇక ఈ సర్కార్‌ పరిస్థితేంటి? అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.. కావాలనే తనను టార్గెట్‌ చేస్తున్నారన్నారు.

దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి.. రైతుల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళ్తా.. మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేసీఆర్‌ వస్తే ఇక ఈ సర్కార్‌ పరిస్థితేంటి? అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.. కావాలనే తనను టార్గెట్‌ చేస్తున్నారన్నారు. రేవంత్‌ సోదరులు ఏ హోదాలో కలెక్టర్‌ ఆఫీసులకు వస్తున్నారు.. 2025లో కేసీఆర్‌ సైలెన్స్‌ బ్రేక్‌ అవుతుంది.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాక్యలు చేశారు. తాము ప్రజల ద్వారా గెలుపొంది రాజకీయాల్లో ఉన్నామంటూ పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో తన రక్తం, వెంట్రుకల శాంపిల్స్‌ ఇస్తానని ఎప్పుడో చెప్పానన్నారు. ఫార్ములా ఈ రేసు డబ్బుల విషయంలో తనదే బాధ్యతన్నారు. తప్పు చేయలేదు, బ్రాండ్‌ హైదరాబాద్‌ కోసమే చెల్లింపులు జరిపామని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వం ఎవరైనా తన వారు లబ్ధి పొందితే .. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 14, 2024 07:52 PM