బాబు, పవన్, లోకేశ్ ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలనుకుంటున్నారు: కొడాలి నాని

|

Dec 21, 2023 | 1:50 PM

విశాఖ సభలో.. ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్‌ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి కొడాలి నాని. 30 ఏళ్ల కిందటే.. చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్‌ఫర్‌పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు. పవన్ భీమవరం, గాజువాకకు.. లోకేశ్.. మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు.

విశాఖ సభలో.. ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్‌ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి కొడాలి నాని. 30 ఏళ్ల కిందటే.. చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్‌ఫర్‌పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు. పవన్ భీమవరం, గాజువాకకు.. లోకేశ్.. మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు. బాబు, పవన్, లోకేష్‌.. ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలని యుద్ధం చేస్తున్నారని సెటైర్ వేశారు కొడాలి నాని.

నిన్న ఇవాళ కాదు.. 2009లోనే వైఎస్ జగన్ యుద్ధం ప్రకటించారన్నారు కొడాలి నాని. పవన్, లోకేశ్‌ అసెంబ్లీకి రాకుండా మట్టి కరిపించారని గుర్తు చేశారు. 40ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును 23సీట్లకు పరిమితం చేసిన దమ్మున్న లీడర్ జగన్ అన్నారు కొడాలి నాని. జగన్‌కు 50శాతం ఓటర్ల మద్దతు ఉందని.. మరోసారి వైసీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు మాజీ మంత్రి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Published on: Dec 21, 2023 01:49 PM