Congress: పరిగిలో కర్ణాటక రైతుల ఆందోళన.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కర్నాటక రైతుల నిరసన చేపట్టారు. వారంతా రేవంత్ రెడ్డి రోడ్‌షో సందర్భంగా కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. స్థానిక కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకున్నారు. ప్లకార్డులు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో పోలీసులు రంగంలో దిగి వారికి సర్దిచెప్పారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కర్నాటక రైతులు నిరసన చేపట్టారు. వారంతా రేవంత్ రెడ్డి రోడ్‌షో సందర్భంగా కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. స్థానిక కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకున్నారు. ప్లకార్డులు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో పోలీసులు రంగంలో దిగి వారికి సర్దిచెప్పారు.
అటు సంగారెడ్డి జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కర్నాటక రైతులు వినూత్న ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేసి మోసపోవద్దు అంటూ నారాయణఖేడ్‌లో ర్యాలీ చేపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదంటూ, తెలంగాణ వాసులు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యొద్దని నినాదాలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 28, 2023 08:52 PM