Watch: పంద్రాగస్టు వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం.. MLA మాధవి రెడ్డి ఏమన్నారంటే..?
కడపలో జరిగిన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. తనకు సీటు కేటాయించలేని జిల్లా కలెక్టర్‌పై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి సీరియస్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ మేరకు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి వివరణ ఇచ్చారు.
స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా ఏర్పడిన ప్రోటోకాల్ వివాదంపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా తన వివరణతో కూడిన ఆడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారుల ఆహ్వానం మేరకు హాజరయ్యానని తెలిపారు. కానీ తనకు కేటాయించిన ప్రదేశంలో వేరే అతిథిలు కూర్చున్నారు.. అక్కడ కూర్చున్నవాళ్లు మన అధికారుల కుటుంబ సభ్యులే అన్నారు. వారిని లేపించి తాను కూర్చోవడం పద్ధతి కాదనిపించిందని.. అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళిపోయానని చెప్పారు. ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.