Vizag: విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ కీలక సమావేశం

|

Sep 23, 2023 | 2:03 PM

విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ సమావేశం జరిగింది. దసరాకు విశాఖకు వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. విశాఖ వందనం పేరుతో స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌ కూడా పాల్గొన్నారు. విశాఖకు ముఖ్యమంత్రి రావడం, ఇక్కడ ఏర్పాట్లన్నీ త్వరలో జరగబోతున్నాయని, అవన్నీ చూస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  KS జవహర్‌ రెడ్డి అన్నారు. 

విశాఖ కేంద్రంగా దసరా నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలకాలని వికేంద్రీకరణ JAC నిర్ణయించింది. విశాఖ వందనం పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు.  సీఎం రాక సందర్భంగా విశాఖలో పండగ వాతావరణం సృష్టించాలని JAC భావిస్తోంది. సీఎం రాక, ఇతర అంశాలపై చర్చించేందుకు వికేంద్రీకరణ JAC విశాఖ నగరంలో సమావేశమైంది. ఈ భేటీలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌ కూడా పాల్గొన్నారు. విశాఖకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా… ఏర్పాట్లన్నీ త్వరలో జరగబోతున్నాయని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్‌ రెడ్డి అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 23, 2023 01:05 PM