Telangana: ఖమ్మం ప్రియాంక ర్యాలీలో భారీగా టీడీపీ శ్రేణులు 

|

Nov 25, 2023 | 12:56 PM

కాంగ్రెస్‌ ర్యాలీల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతోన్నాయి. మొన్న రాహుల్‌ రోడ్‌షోలో... ఇవాళ ప్రియాంక రోడ్‌షోలో పసుపు ఫ్లాగ్స్‌ కనిపించాయి. ఖమ్మం ప్రియాంకగాంధీ ఖమ్మం రోడ్‌షోలో పెద్దఎత్తున టీడీపీ జెండాలు కనిపించాయి. టీడీపీ జెండాలతో ప్రియాంకకు స్వాగతం పలికాయి తెలుగుదేశం శ్రేణులు. వీడియో చూడండి...

ఖమ్మంలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అదేదో నాలుగైదు జెండాలు కాదు… కాంగ్రెస్ జెండాలను డామినేట్ చేసేలా పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అంతే కాదండోయ్.. డ్రమ్స్ చప్పుళ్లకు డ్యాన్సులు వేస్తూ పెద్ద కోలాహలమే చేశారు తెలుగు తమ్ముళ్లు. కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. బహిరంగంగానే టీడీపీ మద్దతు కోరుతున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానంటున్నారు.  కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కానీ టీడీపీ శ్రేణులు మాత్రం పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి