స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు దొరకని ఊరట.. సుప్రీంలో బాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

|

Oct 10, 2023 | 9:45 AM

Chandrababu Quash Petition: చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురైంది!. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టు... ఏ కోర్టులోనూ ఊరట దక్కలేదు!. మూడు చోట్లా దాదాపు సేమ్‌ సీన్సే రిపీట్‌ అయ్యాయ్‌!. ఒక్క కోర్టులో కూడా ఊరట దక్కలేదు!. ఏపీ హైకోర్టులో మొదలైన డిస్మిస్‌ల పర్వం... ఏసీబీ కోర్టు వరకూ కొనసాగాయ్‌. చంద్రబాబు దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టివేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

Chandrababu Quash Petition: చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురైంది!. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టు… ఏ కోర్టులోనూ ఊరట దక్కలేదు!. మూడు చోట్లా దాదాపు సేమ్‌ సీన్సే రిపీట్‌ అయ్యాయ్‌!. ఒక్క కోర్టులో కూడా ఊరట దక్కలేదు!. ఏపీ హైకోర్టులో మొదలైన డిస్మిస్‌ల పర్వం… ఏసీబీ కోర్టు వరకూ కొనసాగాయ్‌. చంద్రబాబు దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టివేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. మూడు కేసుల్లో బెయిల్‌ నిరాకరించింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్, అంగళ్లు అల్లర్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది. కనీసం ఏసీబీ కోర్టులో అయినా ఊరట లభిస్తుందనుకుంటే అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో బాబు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది ఏసీబీ న్యాయస్థానం. అయితే, సీఐడీకి కూడా చుక్కెదురైంది. చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌ను కూడా డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు.

ఇక, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఆసక్తికర వాదనలు జరిగాయ్‌. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్స్‌ హరీష్‌ సాల్వే, సింఘ్వీ, లూథ్రా వాదనలు వినిపించారు. ప్రధానంగా 17A పైనే వాడివేడి వాదనలు జరిగాయ్‌!. చంద్రబాబుకు 17A వర్తిస్తుందంటూ వాదించారు హరీష్‌ సాల్వే. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు అరెస్ట్‌ చేశారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, రిమాండ్‌ ఆర్డర్‌ను హైకోర్టులో సవాల్‌ చేశారా అంటూనే… సెక్షన్‌ 17Aపై కీలక కామెంట్స్‌ చేసింది సుప్రీంకోర్టు. అవినీతి నిరోధక చట్టం ఉద్దేశమే అవినీతిని అడ్డుకోవడమైతే… సెక్షన్‌ 17A కారణంగా ఆ ఉద్దేశం దెబ్బతినకూడదు కదా అంటూ ప్రశ్నించింది. దాంతో, 2017కు ముందే కేసు నమోదైందనడానికి ఆధారాలు లేవన్న సాల్వే, 2021లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్టు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌ఐఆర్‌ తేదీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

మొత్తంగా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ వాదనలు సాగాయ్‌. అయితే, సీఐడీ తరపున వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్నారు ముకుల్‌ రోహత్గీ. దాంతో, రోహత్గీ అభ్యర్థనకు సుప్రీం సమ్మతించింది. ఇక, పీటీ వారెంట్లపైనా ఏసీబీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్‌ జరిగాయ్‌. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్, ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుల్లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ మరోసారి వాదనలు వినిపించారు సీఐడీ తరపు లాయర్లు. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనల సమయంలో చంద్రబాబు తరపు లాయర్‌పై అసహనం వ్యక్తంచేశారు ఏసీబీ కోర్టు జడ్జి. కోర్టుకు టెర్మ్స్‌ డిక్టేట్ చేయొద్దంటూ సీరియస్‌ అయ్యారు. ఓవరాల్‌గా ఏ కోర్టులోనూ ఊరట దక్కలేదు చంద్రబాబుకి. అయితే, క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరి, ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి!

Published on: Oct 10, 2023 09:42 AM