Pawan Kalyan: పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్ ఉందా.!

Updated on: Aug 16, 2024 | 11:14 AM

జూన్ 19.. పవన్ కల్యాణ్ రాజకీయ అధ్యాయంలో ఓ సరికొత్త పేజీ. అప్పటి వరకు పదేళ్లుగా పోరాటాలకే పరిమితమైన ఆయన తొలిసారిగా పాలించే బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలకు మంత్రి అయ్యారు. మంత్రులుగా ఎంత మంది నేతలు బాధ్యతలు స్వీకరించినా.. వాళ్లు వేరు.. పవన్ కల్యాణ్ వేరు. ఇది జనం మాట. సిల్వర్ స్క్రీన్ హీరో.. రియల్ హీరోగా ఎలా పని చేస్తారని.. తాను తీసుకున్న బాధ్యతలకు ఎలా న్యాయం చేస్తారని.?

జూన్ 19.. పవన్ కల్యాణ్ రాజకీయ అధ్యాయంలో ఓ సరికొత్త పేజీ. అప్పటి వరకు పదేళ్లుగా పోరాటాలకే పరిమితమైన ఆయన తొలిసారిగా పాలించే బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలకు మంత్రి అయ్యారు. మంత్రులుగా ఎంత మంది నేతలు బాధ్యతలు స్వీకరించినా.. వాళ్లు వేరు.. పవన్ కల్యాణ్ వేరు. ఇది జనం మాట. సిల్వర్ స్క్రీన్ హీరో.. రియల్ హీరోగా ఎలా పని చేస్తారని.. తాను తీసుకున్న బాధ్యతలకు ఎలా న్యాయం చేస్తారని..? మరి కొద్ది రోజుల్లో ఆయన డిప్యూటీ సీఎంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతిక మంత్రిగా బాధ్యతలు తీసుకొని దాదాపు 2 నెలలు పూర్తవుతుంది. మరి ఈ రెండు నెలల్లో ఆయన పని తీరు ఎలా ఉంది..? జనం ఆశలకు తగ్గట్టుగానే పని చేస్తున్నారా..? ఓ సారి చూసే ప్రయత్నం చేద్దాం. పవన్ చేతులో కీలక శాఖలు ఎన్నికల ముందు ప్రజాసమస్యలపై పోరాటాలు అధికారం చేపట్టాక శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం కూటమితో కలిసి అధికార భాగస్వామ్యంలోకి జనసేన వచ్చి 2 నెలలు పూర్తయ్యింది. మరి కొద్ది రోజుల్లో పవన్ కల్యాణ్ పాలనా బాధ్యతలు స్వీకరించి కూడా 2 నెలలు పూర్తికానుంది. అధికారంలో ఉన్న జనసేనకు ఇప్పుడు కీలకమైన పోర్ట్ ఫోలియోలు ఉన్నాయి అందులో పవన్ పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణ ,శాస్త్ర సాంకేతిక మంత్రిగా బాధ్యతలు...