‘బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఎందుకు నిరసన తెలపకూడదు..?’
చంద్రబాబు వల్లే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగిందని.. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు ఎంపీ కోమటిరెడ్డి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులపై కేసులు పెడితే.. వారి వృత్తి పరంగా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసన తెలుసుపుతున్న ఐటీ ఉద్యోగులపై కేసులు పెట్టడం సరికాదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి. తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగిందని.. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులపై కేసులు పెడితే.. వారి వృత్తి పరంగా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయంపై మాట్లాడదామని ఫోన్ చేస్తే.. పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు కోమటిరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Oct 16, 2023 09:36 PM