వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి వినూత్నంగా సంబరాలు నిర్వహించారు. వరంగల్ చౌరస్తాలో పేద ప్రజలకు ఏకంగా వెయ్యి కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని శ్రీహరి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తుండగా, వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చేసిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సర్కార్ పాలన విజయాలను వివరిస్తూ ఆయన చేపట్టిన సంబరాల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి.. ప్రభుత్వ వెయ్యి రోజుల మైలురాయిని అత్యంత వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వరంగల్ చౌరస్తాలో పేద ప్రజలకు వెయ్యి కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు మంటెక్కిస్తున్న వేళ, సామాన్యుడికి ఉల్లిగడ్డలను ఉచితంగా అందించడం స్థానికంగా చర్చకు దారితీసింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శ్రీహరి కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత ఉల్లి పంపిణీ గురించి తెలుసుకున్న స్థానిక పేదలు, మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరడంతో ఆ ప్రాంతం అంతా జనంతో కిటకిటలాడింది. కాంగ్రెస్ శ్రేణులు రకరకాల వేడుకలు చేసుకుంటున్నప్పటికీ, వరంగల్‌లో రాజనాల శ్రీహరి అమలు చేసిన ఈ ‘ఉల్లి’ ఫార్ములా మాత్రం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్? భారీగా తగ్గిన పసిడి ధర
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్.. చివరికి సింగర్ ప్రాణాన్ని తీసేసింది ఇలా!
