Watch Video: కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

|

Mar 29, 2024 | 3:49 PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రణరంగంలోకి దిగారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మేమంతా సిద్దం పేరుతో బస్సు యత్రను చేపట్టారు. నేటితో మూడవ రోజకు చేరుకుంది ఈ యాత్ర. ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకుంది. అయితే దారిపొడవునా ప్రజలు సీఎం జగన్‎ను చూసి నీరాజనాలు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రణరంగంలోకి దిగారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మేమంతా సిద్దం పేరుతో బస్సు యత్రను చేపట్టారు. నేటితో మూడవ రోజకు చేరుకుంది ఈ యాత్ర. ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకుంది. అయితే దారిపొడవునా ప్రజలు సీఎం జగన్‎ను చూసి నీరాజనాలు పడుతున్నారు. మార్గం మొత్తం జనసందోహంలో నిండిపోయింది. అడుగడుగునా జై జగన్ నినాదాల మధ్య ప్రజలతో మమేకం అవుతున్నారు సీఎం జగన్.

కోడుమూరులో బస్సు యాత్రను చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం జగన్ బస్సు దిగి ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు,వృద్ధులతో మాట్లాడిన సిఎం జగన్ మోహన్ రెడ్డి పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రతి నెల పెన్షన్ అందుతుందా అంటూ వృద్ధురాలితో మాట్లాడారు. పెన్షన్లు,పథకాలు అందుతున్నాయని సీఎం జగన్‎కు స్థానిక మహిళలు చెప్పారు. రానున్న రోజుల్లో మీ బిడ్డను గెలిపిస్తే మరింత సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడిని ధనవంతుడిగా మార్చాలన్నదే తన ధ్యేయం అన్నారు. మీ ఆశీర్వాదం నాకు అందజేయండి అని వినమ్రతతో కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us on