CM Chandrababu: గెట్ రెడీ.. బీ అలర్ట్.. ఎక్కడా తగ్గొద్దు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
గెట్ రెడీ.. బీ అలర్ట్ అంటున్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, అధికారులతో సడెన్‌గా మీట్ అయిన ఆయన.. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయడం ఆసక్తిగా మారింది. కేబినెట్ సమావేశం నిర్వహించకుండానే.. అంతకుమించి.. అనే రేంజ్‌లో భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ.. మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఎందుకు భేటీ నిర్వహించారు?.. మంత్రులు, అధికారులతో చర్చించిన ఆ కీలక అంశాలేంటి?..
ఏపీ రాజకీయాల్లో హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. అధికార, విపక్షాల మాటలయుద్ధాలతో రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా మెడికల్ కాలేజీల ఎపిసోడ్, విజయవాడ డయేరియా లాంటి అంశాలతో ఏపీ పాలిటిక్స్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాయి. వాటన్నింటిపైనా ఏకకాలంలో ఎటాక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా.. పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలను డెవలెప్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా.. వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ వైసీపీ ఆరోపించడం దుమారం రేపింది. అయితే.. మెడికల్ కాలేజీల విషయంలో వీడియోలతో టీడీపీ కౌంటర్ ఎటాక్ చేసింది. విజయవాడ డయేరియా అంశం కూడా పొటికల్ టర్న్ తీసుకోగా.. టీడీపీ-వైసీపీ మధ్య వార్ జరిగింది. అలాగే.. యూరియా కొరత విషయంలోనూ వైసీపీ పోరుకు సన్నద్ధం అవుతోంది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనుండడంతో వివిధ అంశాలపై కూటమి సర్కార్‌ను కడిగేయాలని వ్యూహాలు రచిస్తోంది.
మంత్రులకు, నేతలకు ఇప్పటికే పలుమార్లు క్లాస్‌లు
వాస్తవానికి.. వైసీపీకి దీటుగా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే అసంతృప్తి సీఎం చంద్రబాబును మొదటి నుంచి ఇబ్బంది పెడుతోంది. దీనికి సంబంధించి మంత్రులకు, నేతలకు ఇప్పటికే పలుమార్లు క్లాస్‌లు పీకారు. ఇప్పుడు.. మరోసారి అలర్ట్ అయ్యారు. దీనిలో భాగంగానే.. ఎలాంటి క్యాబినెట్ సమావేశం లేకుండానే.. అంతకుమించి అనే రేంజ్‌లో భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో వివిధ అంశాలపై మంత్రాంగం చేశారు. డయేరియా, మెడికల్ కాలేజీల ఇష్యూ, స్టీల్ ప్లాంట్, యూరియా లాంటి అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించి మంత్రులతోపాటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో.. ఎలాంటి ఇన్‌పుట్స్ చేతిలో ఉండాలో మంత్రులకు, అధికారులకు సూచించారు. ఓవరాల్‌గా వైసీపీ విమర్శల విషయంలో ఎక్కడా తగ్గొద్దనే సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు.
పౌరసేవలు, పథకాల అమలుపై జవాబుదారీతనం ఉండేలా కాన్ఫరెన్స్
మరోవైపు… రేపు, ఎల్లుండి జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పైనా మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ సారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ విభిన్నంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి చెందడం చాలా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. దీనికి అనుగుణంగానే.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. బదిలీలపైనా స్పందించిన చంద్రబాబు.. సరైన వ్యక్తి, సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేశామని చెప్పారు. మొత్తంగా.. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేబినెట్‌ను మించి సమావేశం నిర్వహించి ఒక్కసారిగా హీట్ పెంచారు సీఎం చంద్రబాబు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
