Watch Video: చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారు.. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

|

Sep 22, 2023 | 5:56 PM

ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు ఇన్నాళ్లకు తాను చేసిన తప్పులకు పక్కా ఆధారాలతో దొరికారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు పాపం ఇన్నాళ్లకు పండిందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇన్నాళ్లకు తాను చేసిన తప్పులకు పక్కా ఆధారాలతో దొరికారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. చంద్రబాబు దోచుకున్న సొమ్ము లాయర్ల పాలవుతోందని ఎద్దేవా చేశారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార తీరు సరిగ్గా లేదంటూ మండిపడ్డారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. శని, ఆదివారాల్లో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించబోతున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 5 వరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సీఐడీ విచారణ జరగబోతోంది.  సీఐడీ కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు..మూడు కండీషన్లు పెట్టింది. చంద్రబాబును విచారించే సీఐడీ అధికారుల జాబితా కోర్టుకు ఇవ్వాలని కోరింది. అలాగే నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని సీఐడీని కోర్టు ఆదేశించింది. చంద్రబాబును ఏయే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనే అంశంపై సీఐడీ అధికారులు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..