CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?

Updated on: Feb 05, 2026 | 9:00 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో కెమికల్స్‌తో లడ్డూలు తయారు చేశారని, సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దేవుడి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ మహాపాపంపై వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న అంశంపై వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కెమికల్స్‌తో లడ్డూలను తయారు చేశారని, ఆ లడ్డూలను తిన్న భక్తులను దేవుడే కాపాడారని ఆయన అన్నారు. వైసీపీకి సిట్ క్లీన్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న చంద్రబాబు, దేవుడంటే విశ్వాసం లేకపోతే ఆ జోలికి పోవద్దని హితవు పలికారు. వైసీపీ నేతలు దేవుడి దగ్గర దుర్మార్గమైన అపచారం చేశారని ఆరోపించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కెమికల్స్ కల్తీ జరిగినట్లు స్పష్టంగా ఉందని, ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KCR: గజ్వేల్ మా ఇలాకా.. చూపిస్తాం మా తడాఖా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్‌లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??

Ram Charan: నెక్ట్స్‌ లెవల్‌లో మెగా డెడికేషన్‌.. ఎన్ని జరిగినా ఆగేదెలే

Loading...
Unable to load recommendations.
Follow Us