బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ప్రధాని మోదీ పోటీ అక్కడే.?
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర పడడంతో తొలి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు..
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర పడడంతో తొలి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌లకు చోటు దక్కే ఛాన్స్.