Big News Big Debate: టర్న్‌ తీసుకున్న ఏపీ రాజకీయాలు.. బీజేపీ స్వరం మారడంతో గొంతు సవరించిన జగన్‌.. లైవ్ వీడియో

Updated on: Jun 12, 2023 | 6:59 PM

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ప్రకటనే ఈ మార్పునకు బీజం వేసింది. బీజేపీతో చెలిమి కొనసాగిస్తూనే టీడీపీకి కన్నుగీటారు పవన్‌ కల్యాణ్. 2018 తర్వాత విడిపోయిన బీజేపీ, టీడీపీలను చేరవ చేయడానికి గట్టి పట్టే పట్టారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ప్రకటనే ఈ మార్పునకు బీజం వేసింది. బీజేపీతో చెలిమి కొనసాగిస్తూనే టీడీపీకి కన్నుగీటారు పవన్‌ కల్యాణ్. 2018 తర్వాత విడిపోయిన బీజేపీ, టీడీపీలను చేరవ చేయడానికి గట్టి పట్టే పట్టారు. ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం కావడంతో పవన్‌ ప్రయత్నాలు ఫలించాయనే చర్చ సాగింది. టీడీపీ, బీజేపీ, జనసేన మళ్లీ కలుస్తున్నాయా అనే ప్రచారం జోరందుకున్న తరుణంలోనే ఏపీ టూర్‌లో జేపీ నడ్డా, అమిత్‌షాలు వైసీపీని నేరుగానే టార్గెట్‌ చేశారు. పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్‌ అవుతోంది. దీంతో ఢిల్లీ స్థాయిలో సఖ్యతగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు చెడిపోయాయా.. అనే అనుమానాలు.. తాజాగా సీఎం జగన్‌ చేసిన కామెంట్స్‌తో మరింతగా బలపడుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క మాంసానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ !!

గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి

ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..