Big News Big Debate: షర్మిల హద్దులు మీరి వ్యాఖ్యలు చేశారా..? బీజేపీ వదిలిన బాణమే వైఎస్ఆర్‌టీపీనా..?

|

Nov 30, 2022 | 6:47 PM

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అసలు గుట్టు వీడుతోందా.? బీజేపీ పెద్దలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ పావులు కదుపుతుందా..? కేసుపై కోర్టులో సమర్పించిన ఆధారాలేంటి.? న్యాయస్థానంలో దవే చేసిన కామెంట్స్‌ ఎవరిని ఉద్దేశించి..?


తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా ఈ రెండు పార్టీల మధ్యే మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా షర్మిల వ్యవహారం కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు గులాబీ వర్సెస్‌ కమలంగా మారింది. బీజేపీ వదిలిన బాణం వైఎస్‌ఆర్‌టీపీ వచ్చి తెలంగాణలో అలజడికి కుట్ర చేస్తుందని టీఆర్ఎస్‌ నేతలు అంటే.. లెఫ్ట్‌ పార్టీలు మీరు వదిలిన బాణాలు కాదా అంటూ కౌంటర్‌ ఇస్తోంది కాషాయం పార్టీ.
*ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా భాగ్యనగరానికి వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది…
*అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన YSRTP అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్‌ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి.
*షర్మిల వ్యాఖ్యలతో టీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెగింది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలో దిగి YSRTPపై మాటలదాడి పెంచారు. ఎమ్మెల్సీ కవిత, షర్మిల మధ్య ట్వీట్‌ పోరు పీక్‌లోకి చేరింది. బీజేపీ వదిలిన బాణం హద్దులు మీరితే గోదారి కూడా దాటలేరంటూ వార్నింగులు కూడా టీఆర్ఎస్‌ నుంచి వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో