Andhra Pradesh Assembly: రూల్స్‌ ప్రకారం ఆ బిల్లులు ఇవ్వలేము.. టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ

|

Nov 16, 2024 | 3:59 PM

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొనసాగుతున్నాయి.. ఐదో రోజుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపారు.. 2024 -25 బ‌డ్జెట్‌ డిమాండ్స్, గ్రాంట్స్‌పై మంత్రులు ఇవాళ వివ‌ర‌ణ‌ ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొనసాగుతున్నాయి.. ఐదో రోజుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపారు.. 2024 -25 బ‌డ్జెట్‌ డిమాండ్స్, గ్రాంట్స్‌పై మంత్రులు ఇవాళ వివ‌ర‌ణ‌ ఇచ్చారు. R అండ్ B, ఇండస్ట్రీస్, జల వనరులు, వ్యవసాయం, సివిల్ సప్లై, హౌసింగ్ శాఖల గ్రాంట్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇచ్చారు. అనంతరం ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా ఏపీ టిడ్కో అధ్వ‌ర్యంలో నిర్మించిన ఇళ్లపై స‌భ‌లో చ‌ర్చ నిర్వహించారు. శాసన మండలికి నేడు సెలవు ఉంది. సోమవారం శాసన మండలి జరగనుంది..

టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. పరిపాలన అనుమతులు లేకుండానే.. టిడ్కో ఇళ్లకు జగన్‌ హయాంలో వైసీపీ రంగులు వేశారని ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రక్టర్లు అడుగుతున్నారని కానీ రూల్స్‌ ప్రకారం ఆ బిల్లులు ఇవ్వలేమని మంత్రి నారాయణ అన్నారు. అయితే, అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని మంత్రి బొత్స నా మాటే జీఓ అని రంగులు వేయించారని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మాటే జీవో అని చెప్పి గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను మోసం చేసిందంటూ విమర్శించారు.

సాగునీటి రంగాన్ని నాశనం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను అంధకారంలోకి నెట్టారంటూ పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ లైవ్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..