Watch Video: కర్ణాటకలో మళ్లీ అధికారం మాదే.. నెక్ట్స్ తెలంగాణలోనూ.. అమిత్ షా ధీమా

|

May 08, 2023 | 1:24 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు. 224 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కాపాడుకోవాలంటే 113 సీట్లు రావాల్సి ఉంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు. 224 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కాపాడుకోవాలంటే 113 సీట్లు రావాల్సి ఉంది. మే 10న పోలింగ్ నిర్వహించి.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ ఈ మ్యాజిక్‌ మార్క్‌ను దాటి మరో 15 సీట్లు ఎక్కువే గెలుస్తుందన్నారు అమిత్ షా. కాంగ్రెస్‌ చేస్తోన్న 40 శాతం కమీషన్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కర్నాటక ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతోపాటు విస్తృతంగా ప్రచారం చేసిన అమిత్‌ షా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కర్ణాటక తర్వాత తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.

Published on: May 08, 2023 01:22 PM