Watch Video: బండారు క్షమాపణ చెప్పాలి.. మంత్రి రోజాకు సినీ నటి కుష్బూ బాసట..

|

Oct 06, 2023 | 1:49 PM

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సినీ నటి కుష్బూ తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను మంత్రి రోజాకు మద్ధతుగా పోరాటం చేస్తానని చెప్పారు.

టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. మహిళా మంత్రిపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని.. ఓ మనిషిగా కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. మహిళలను దూషించడం తన జన్మహక్కు అన్నట్లు టీడీపీ నేత వ్యవహార తీరు ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను రోజాకు సపోర్ట్‌‌గా పోరాటం చేస్తానని చెప్పారు.

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై నగిరిపాలెం పోలీసులు కేసు నమోదుచేసి అక్టోబర్ 2న అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మంత్రి రోజా తీవ్రంగా దూషించినందునే.. తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.