PM Modi Ayodhya Visit: అయోధ్యలో 15 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ పర్యటన.. లైవ్

PM Modi Ayodhya Visit: విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా.. ఇవాళ అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.

Updated on: Dec 30, 2023 | 11:35 AM

PM Modi Ayodhya Visit: విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా.. ఇవాళ అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఉదయం 11గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్‌ రైల్వేస్టేషన్‌, మధ్యాహ్నం12గంటల15 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తారు. ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోయింది.

ప్రధాని మోదీకి టెంపుల్ టౌన్‌ ఘన స్వాగతం పలకబోతోంది. అయోధ్య వాసులతోపాటు దేశంలోని 1,400 మంది కళాకారులు దారిపొడవునా మోదీకి నీరాజనం పట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి అయోధ్య ధామ్‌ రైల్వేస్టేషన్ వరకూ 40 స్టేజీలు ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాలను విచ్చేసిన కళాకారులు.. ఆయా స్టేజీల నుంచి వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతారు. అయోధ్యకు చెందిన వైభవ్ మిశ్రా శంఖానాదంతోనూ, కాశీకి చెందిన మోహిత్ మిశ్రా ఢమరు వాద్యంతోనూ ప్రధానికి ఘనస్వాగతం చెప్తారు. పలువురు కళాకారులు వారివారి నృత్యరీతులతో అలరించనున్నారు. అయోధ్య ధామ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్వవేక్షించారు యూపీ సీఎం యోగి. అయోధ్య ధామ్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లను రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ పరిశీలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us