Watch Video: పొలిటికల్ బెట్టింగులకు బలైన వ్యక్తి.. ఆత్మహత్యకు కారణం అప్పేనా..

|

Jun 10, 2024 | 11:04 AM

30 కోట్ల అప్పు.. ఔను.. అక్షరాలా 30 కోట్ల అప్పు..ఇంత అప్పు పొలిటికల్‌ బెట్టింగ్‌ల వల్లేనా.. వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయా. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి.. తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వేణుగోపాలరెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడని స్థానికులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా బెట్టింగ్‌లు వేసినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు పోగోట్టుకున్నాడంటున్నారు.

30 కోట్ల అప్పు.. ఔను.. అక్షరాలా 30 కోట్ల అప్పు..ఇంత అప్పు పొలిటికల్‌ బెట్టింగ్‌ల వల్లేనా.. వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయా. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి.. తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వేణుగోపాలరెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడని స్థానికులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా బెట్టింగ్‌లు వేసినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు పోగోట్టుకున్నాడంటున్నారు. ఇంకా ఇవ్వాల్సిన అప్పులు చాలా ఉన్నాయని.. ఆ ఒత్తిడి తట్టుకోలేకే సూసైడ్‌ చేసుకున్నాడని స్థానికంగా చెప్తున్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారు తమకు డబ్బులు చెల్లించకపోడంతో వేణు ఇంటికి వెళ్లి తాళం వేసిన తలపులను పగులగొట్టారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ఏసీ, టీవీ సహా విలువైన వస్తువులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం అందుకున్న వేణు పురుగుల మందు తాగి సూసైడ్‌ చేసుకున్నారు. అయితే శరీరంపై గాయాలు ఉండడంతో.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on