అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

Updated on: Jun 17, 2026 | 11:32 AM

పవన్ కల్యాణ్ హనుమకొండకు చేరుకుని జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ను పరామర్శిస్తున్నారు. హనుమాన్‌నగర్‌కు చెందిన రాము-మానస దంపతుల కుమారుడు నిరంజన్, తన అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్‌ను ఒక్కసారి కలవాలనే కోరికను వ్యక్తం చేయగా, ఆయన స్వయంగా స్పందించి పరామర్శించేందుకు వచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో గడపనున్న పవన్ కల్యాణ్ రాకతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్‌ను పరామర్శిస్తున్నారు.. ఒక్కసారి చూడాలని ఉందన్న ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా కదిలి అక్కడికి చేరుకుని.. నిరంజన్ తో మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్‌ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా బావిస్తున్న ఆ కుటుంబం పవన్ కల్యాణ్ రాక కోసం ఎదురుచూసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కల్యాణ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము – మానస దంపతుల కుమారుడు నిరంజన్.. జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో మంచానికి పరిమితమైయ్యాడు. ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ హనుమకొండకు చేరుకుని.. మాట్లాడుతున్నారు.

Published on: Jun 17, 2026 10:57 AM
Follow Us