Parliament Winter Session Live: దుమ్ముదుమారమే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దని ప్రధాని మోదీ కోరారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ అంశంపై మాణిక్కం ఠాగూర్, వాయు కాలుష్యంపై రంజిత్ రంజన్ వాయిదా తీర్మానం ఇచ్చారు. జీరో అవర్ రద్దు చేసి ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. SIRపై చర్చించాలంటూ రాజ్యసభలో AAP ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎలాంటి సందేహాలు అవసరం, లేదు S.I.Rపై అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని కేంద్రం తెలిపింది. ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దని ప్రధాని మోదీ కోరారు. డ్రామాలు వద్దు.. దేశ ప్రగతి కోసం చర్చలు జరగాలని హితవు పలికారు. సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని కోరారు మోదీ.. దేశ ప్రగతి కోసం విలువైన సలహాలు ఇవ్వాలని కోరుతున్నా అంటూ పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ.
