Watch: పాకిస్తాన్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు..వైరల్ అవుతున్న వీడియోలు

Updated on: Sep 28, 2025 | 2:31 PM

పాకిస్థాన్‌లోని కరాచీలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి, దాండియా నృత్యాలతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న దేశంలో హిందూ పండుగ సంబరాలు నెటిజన్లను సంతోషపరుస్తున్నాయి. ఇది సాంస్కృతిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది.

దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  కేవలం భారతదేశంలోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ దసరా నవరాత్రుల వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. పాకిస్తాన్ లోని కరాచీలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి, దాండియా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని హిందూ నివాసి ప్రీతమ్ దేవ్రియా ఈ వేడుకల వీడియోను పంచుకున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..