Video: నిద్రపోతున్న వ్యక్తి పైకెక్కిన నాగుపాము.. బెడ్‌పై ఓ మూలన చుట్టుకుని.. ఆ తర్వాత సీన్ ఇది.!

మయూర్‌భంజ్ జిల్లాలోని దాహిసహి గ్రామంలో నివాసముంటున్న ఓ యువకుడి మంచంపైకి నాగుపాము అనుకోని అతిధిలా వచ్చి షాక్‌కు గురి చేసింది. ఆ యువకుడు రాత్రంతా హాయిగా నిద్రపోగా.. ఉదయాన్నే లేచి చూసేసరికి నాగుపాము ప్రత్యక్షం అయింది. ఆ భయంకరమైన దృశ్యానికి అతడికి ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. ఆ వివరాలు ఇలా..

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని దాహిసహి గ్రామంలో నివాసముంటున్న ఓ యువకుడు తన మంచంపైకి.. అది కూడా దోమలతెర ఉండగా కూడా ఓ నాగుపాము ప్రవేశించడాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ యువకుడు రాత్రంతా గాఢ నిద్రలో ఉండగా.. పాము ఎప్పుడు వచ్చిందో ఏమో గానీ.. అతడికి ఎలాంటి హనీ కలగించకుండా అక్కడే కూల్‌గా కూర్చుంది. ఇక ఆ యువకుడు ఉదయాన్నే లేచి చూసేసరికి తన పక్కన ఉన్న అనుకోని అతిధి ప్రత్యక్షమైంది. అతడొక్కడే కాదు.. ఇంట్లోనే అతడి కుటుంబీకులు కూడా దోమతెర మూలన ఉన్న పామును చూసి కళ్లు తేలేశారు.

నిజానికి, ఆ యువకుడు రాత్రి తన కుటుంబంతో కలిసి భోజనం చేసి.. ఆ తర్వాత నిద్రపోవడానికి తన గదిలోకి చేరుకున్నాడు. అతడు నిద్రపోతున్న సమయంలో 8 అడుగుల పొడవైన విషపు నాగుపాము గదిలోకి ప్రవేశించింది. అనుకోని అతిధిలా గదిలోకి వచ్చి ఆ నాగుపాము.. దోమలతెరలో నుంచి ప్రవేశించి.. హాయిగా అక్కడే తిష్ట వేసింది. ఆ యువకుడు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు.. దాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యాడు.

దోమతెరలోకి ప్రవేశించిన నాగుపాము..

అతను రాత్రంతా గాఢంగా నిద్రపోతున్నా.. దోమతెర లోపల ఒక మూలలో నిశ్శబ్దంగా ఒక విషపూరితమైన నాగుపాము కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పాము రాత్రంతా ఎవరికీ హాని చేయలేదు. మంచంపై పాము కనిపించిన వెంటనే ఇంట్లో గందరగోళం నెలకొంది. కుటుంబ సభ్యులు వెంటనే పాముల పట్టే వ్యక్తీకి ఫోన్ చేసి.. సమాచారం అందించాడు. ఆపై పాములు పట్టే వ్యక్తీ అత్యంత జాగ్రత్తగా పామును పట్టుకుని బంధించాడు. ఆ తర్వాత సమీప అడవిలో విడిచిపెట్టాడు. గత కొన్ని రోజులుగా స్థానికంగా వర్షాలు కురవడం, చుట్టూ బురద, తేమ ఏర్పడటంతో పాములు పొడి, వెచ్చని ప్రాంతాలను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయని అంటున్నారు.