తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి

Updated on: Mar 29, 2026 | 1:00 PM

తెలంగాణ వాహనదారులకు శుభవార్త! రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం RTO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త 'సెంట్రలైజ్డ్ కార్డ్ ప్రింటింగ్' విధానం ద్వారా DL, RC కార్డులు నేరుగా పోస్టల్ ద్వారా మీ ఇంటికే వస్తాయి. ఇది ఆలస్యం, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గిస్తుంది, పారదర్శకతను పెంచుతుంది. సులభమైన సేవలతో సమయం ఆదా అవుతుంది.

తెలంగాణని వాహనదారులకు ఊరటనిస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌లు , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా పోస్టల్ ద్వారా ఇంటికే పంపించే ‘సెంట్రలైజ్డ్ కార్డ్ ప్రింటింగ్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 61 ఆర్టీవో కార్యాలయాల పరిధిలోనే లైసెన్స్‌లు, ఆర్సీలు ప్రింట్ చేసి వాహనదారులకు అందిస్తున్నారు అయితే, ఈ విధానంలో నెలకొంటున్న ఆలస్యం, మధ్యవర్తుల జోక్యం, అవినీతి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది. ఏడాదికి సుమారు 15 లక్షల కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తవడానికి వారాలు, కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పడుతోంది. యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే సుమారు రూ. 135 కోట్ల నిధులను నేరుగా రవాణా శాఖకే కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంట్రలైజ్డ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, పారదర్శకత పెరుగుతుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కార్డులు నేరుగా దరఖాస్తుదారుల ఇంటికే చేరుతాయి. తద్వారా ట్రాఫిక్ తనిఖీల్లో ఎదురయ్యే ఇబ్బందులకు కూడా శాశ్వత పరిష్కారం దొరికే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!

రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌

పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ

Loading...
Unable to load recommendations.
Follow Us