తరుచూ తలనొప్పి పరేషాన్ చేస్తోందా ?? ఈ పని చేయండి ఇట్టే పోతుంది..!
తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే నేను చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి. తరచు తలనొప్పి వచ్చేవాళ్లు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవడం మంచిది. తద్వారా బాడీలో డీహైడ్రేషన్ తగ్గుతుంది. దీనివల్ల బాడీలో హీట్ కూడా తగ్గుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా తలనొప్పి సమస్య ఎదురవుతుంది. ఎండ వేడి అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి.
దీని ఫలితంగా తలనొప్పి మొదలవుతుంది. వేసవిలో వేడి కారణంగా శరీరంలో తేమ తగ్గిపోతుంది. దాంతో తలనొప్పి రావడం సాధారణం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యమైనది. ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ నివారించవచ్చు. ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటు. సమ్మర్లో చాలామందికి తలనొప్పి సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు మినిమం కేర్ చేయాల్సింది చేయాలి. కాప్ గాని స్కార్ఫ్ గాని ఇట్లాంటివి కేర్ చేయడం వల్ల వేడి అనేది మనకు తగలదు. దానివల్ల తలనొప్పి రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ప్రయోజనకరం. నువ్వుల నూనెతో తలపై సున్నితంగా మసాజ్ చేస్తే శరీరంలో ప్రశాంతంగా ఉంటుంది. ఇది తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ఎండలో ఎక్కువ సమయం గడిపిన తలనొప్పి సమస్య పెరుగుతుంది. ఎండవేడి నుండి తలకు రక్షణ ఇస్తే తలనొప్పిని నివారించవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు
మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన