సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ.. కుమారుడు అనంత్ అంబానీతో కలిసి శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. అంబానీ కుటుంబం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ముఖేశ్ అంబానీ కుటుంబం ఆలయానికి చేరుకున్నారు. కాగా, ప్రతి ఏటా ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గత సంవత్సరం కూడా వారు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కాగా, నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను నిర్మించనున్నట్లు తెలియజేశారు. అదే సమయంలో కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
మరిన్ని వీడియోల కోసం :
