8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొడుకు ఆత్మహత్యకు కారణమయ్యారంటూ కోడలితో పాటు పలువురిపై ఓ తల్లి ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసింది. కేసును విచారించిన కోర్టు ప్రధాన నిందితురాలికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. న్యాయం చేసిన పోలీసులను తల్లి సన్మానిస్తూ, మిగతా నిందితులపై కూడా చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని ప్రకటించింది.
కోడలు చేసిన తప్పునకు, వేధింపులకు తాళలేక కొడుకు బలవన్మరణానికి పాల్పడితే.. ఆ తల్లి అధైర్యపడలేదు. ఎనిమిదేళ్ల పాటు చట్టంతో పోరాడి నిందితులకు శిక్ష పడేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పేరాయిగూడెం నెహ్రూనగర్‌కు చెందిన తగరం ముత్యాలరావుకు 2014లో శ్యామలతో వివాహమైంది. అయితే, శ్యామల అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ముత్యాలరావు వారించినా ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా, కొందరు పెద్దమనుషులతో కలిసి ఆయనను మానసికంగా వేధించింది. ఈ అవమానాన్ని భరించలేక ముత్యాలరావు 2018 జూలై 31న ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతికి కారణమైన కోడలితో పాటు 14 మందిపై ముత్యాలరావు తల్లి తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రధాన నిందితురాలు శ్యామలకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, మిగతా ముద్దాయిలు వెంకటేశ్వరరావు, రామారావు, పల్లారావు, నర్సమ్మలకు వేర్వేరు శిక్షలు ఖరారు చేసింది. తమకు న్యాయం చేసిన అశ్వారావుపేట సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై యయాతిరాజులను తల్లి తిరుపతమ్మ శనివారం స్టేషన్‌లో సన్మానించి మిఠాయిలు పంచారు. మిగతా నిందితులకు కూడా శిక్ష పడేవరకు హైకోర్టులో పోరాడుతానని ఆ తల్లి స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kailash-Manasarovar Yatra: కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
Health Alert: న్యూస్ పేపర్‌లో ఫుడ్ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
