అభిమాని కోసం ఆటో నడిపిన మంత్రి జగదీష్ రెడ్డి.. తండాలో డ్రైవర్ అవతారం ఎత్తి సందడి..

Suryapet District News: గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు పలు గృహాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి తండాకు వెళ్లారు. మంత్రి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అయన అభిమాని బానోతు రవి నాయక్ తాను నూతనంగా కొనుగోలు చేసిన ఆటోను తన అభిమాన నేత జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరారు. వెంటనే అభిమాని కోరిక మేరకు ఆటోను నడిపి ప్రారంభించిన మంత్రి.. కిలోమీటర్ వరకు..

Edited By:

Updated on: Sep 10, 2023 | 6:36 PM

సూర్యాపేట జిల్లా, సెప్టెంబర్ 10: సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎప్పడూ ప్రజలతో మమేకమైపోతుంటారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ క్రమంలోనే తన అభిమాని కోరిక మేరకు ఆటో నడిపి సందడి చేశారు. అదే ఆటోలో గృహలక్ష్మి లబ్ధిదారుడీ ఇంటికి వెళ్ళి నూతన గృహానికి శంకు స్థాపన కూడా చేసి సామాన్యుని సొంతింటి కలను నెరవేర్చారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యనాయక్ తండాలో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు పలు గృహాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి తండాకు వెళ్లారు. మంత్రి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అయన అభిమాని బానోతు రవి నాయక్ తాను నూతనంగా కొనుగోలు చేసిన ఆటోను తన అభిమాన నేత జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరారు. వెంటనే అభిమాని కోరిక మేరకు ఆటోను నడిపి ప్రారంభించిన మంత్రి.. కిలోమీటర్ వరకు నడుపుకుంటూ గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి శంకుస్థాపన చేశారు. దీంతో అభిమాని ఆనందానికి అంతలేకుండా పోయింది. తన అభిమాని కోరిక తీర్చడం కోసం సాధారణ వ్యక్తిలా మంత్రి ఆటో నడపడంతో తండా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us