Video: బండికి పెట్రోల్ కొట్టిద్దామని బంక్‌కు.. ఆ తర్వాత సీన్‌తో పొట్టచెక్కలే..

Updated on: Sep 02, 2025 | 8:09 PM

Viral Video: ఇక్కడ వైరల్ వీడియో పెట్రోల్ పంపులో జరిగిన ఓ వింత సంఘటనను చూపిస్తుంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు నవ్వుల్లో మునిగిపోతున్నారు. పెట్రోల్ పంప్‌లో ఓ అబ్బాయి ఏం చేశాడో చూసి, అమ్మాయిలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Trending Video: సోషల్ మీడియాలో ముఖ్యంగా స్కూటీలు తోలే అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న వీడియోలు ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడ చూసే వీడియో మాత్రం అంతకుమించింది. ఇంతకుముందు వీడియోలన్నింటి కంటే మమ్మీ క్రోకోడైల్‌గా నెటిజన్లు పిలస్తున్న ఈ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.

ఈ వైరల్ వీడియో పెట్రోల్ పంప్ వద్ద జరిగిన ఓ వింత సంఘటనను చూపిస్తోంది. ఇది చూసిన తర్వాత నెటిజన్లు, ముఖ్యంగా స్కూటీ తోలే అమ్మాయిలతోనే కాదు అబ్బాయిలతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మమ్మీ క్రోకోడైల్ ఈ వీడియోను పిలుస్తున్నారు.

వైరల్ వీడియోలో, ఇద్దరు స్కూటర్ రైడర్లు పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ కొట్టించేందుకు తమ వంతు కోసం వేచి ఉన్నట్లు చూడొచ్చు. అకస్మాత్తుగా, వెనుక నిలబడి ఉన్న ఒక అబ్బాయి తన స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయారు. స్కూటర్ చాలా వేగంగా కదులుతూ పెట్రోల్ పంప్ ఉద్యోగిని ఢీకొట్టింది. దీంతో అతను నేలపై పడిపోయాడు. ఇదంతా చాలా వేగంగా జరిగింది.

ఇప్పుడు ఈ సంఘటనతో నెటిజన్లు చాలా సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. @comedy.ideas అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష 82 వేలకు పైగా లైక్ చేశారు.

ఈ వీడియోపై ఒక అమ్మాయి వ్యాఖ్యానిస్తూ, “మొత్తం మహిళా సమాజం సంతోషంగా ఉంది” అని రాసింది. మరొకరు, “ఇప్పుడు నా హృదయానికి శాంతి లభించింది” అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 02, 2025 08:06 PM