మంచుకొండల్లో మంట పెట్టిందెవరు..?వీడియో

Updated on: Sep 27, 2025 | 8:02 AM

శాంతియుతంగా ఉండాల్సిన లడఖ్‌లో అల్లర్లు చెలరేగాయి. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ డిమాండ్‌తో ఇంజినీర్ సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టగా, ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీని వెనుక విదేశీ శక్తుల నిధులు, దేశ వ్యతిరేక కుట్రలు ఉన్నాయని కేంద్రం అనుమానిస్తోంది. సోనమ్ సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహించింది.

మంచుకొండల్లో శాంతియుతంగా ఉండాల్సిన లడఖ్ ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతోంది. రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోకి లడఖ్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఆయన పిలుపునిచ్చిన ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారి, పోలీసులతో ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, డెబ్బై మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో