KTR: చంద్రబాబు అరెస్టుపై నా వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారు: కేటీఆర్
KTR: చంద్రబాబు నాయుడు అరెస్టుపై తన వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారని KTR స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సందర్భం లేని విషయాలను కలిపి వక్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా చంద్రబాబు పాత కారు ఫోటోను BRS గుర్తుతో ముడిపెట్టడం, తన ట్వీట్‌ను అరెస్టుతో అనుసంధానించడంపై కేటీఆర్ వివరణ ఇచ్చారు..
చంద్రబాబు నాయుడు అరెస్టుపై తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా అపార్థం చేసుకుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. TV9 “క్రాస్ ఫైర్ విత్ KTR” కార్యక్రమంలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సంఘటనలను వక్రీకరించే తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాత అంబాసిడర్ కారు ఫోటోను షేర్ చేయడం, దాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BRS పార్టీ గుర్తు కారుకు ముడిపెట్టడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఇది కేవలం చంద్రబాబు వ్యక్తిగత జ్ఞాపకమని, అయితే సోషల్ మీడియా దీనికి రాజకీయ రంగు పులిమిందని ఆయన అన్నారు.
అదేవిధంగా, చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తాను మెడిహిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో వరుణ్ గ్రోవర్ స్టాండప్ కామెడీ షో చూస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఆ సమయంలో తనకు అరెస్టు విషయం తెలియదని, బయటకొచ్చాక తాను చేసిన ట్వీట్‌ను, చంద్రబాబు అరెస్టును అనుసంధానించి, తాను నవ్వుతున్నట్లుగా తప్పుగా చిత్రీకరించారని కేటీఆర్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ప్రమాదకరమని ఆయన అన్నారు.
