KTR: ‘ఆ లక్ష ఓట్ల కోసమే అజారుద్దీన్ ను మంత్రిగా చేశారు’
ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజారుద్దీన్‌ను మంత్రిగా చేశారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, వ్యాపారాలు దెబ్బతిని, అరాచకం పెరిగిందని కేటీఆర్ విమర్శించారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో లక్షకు పైగా ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకుని అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించారని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. ఓటమి భయం లేకపోతే మైనారిటీకి రెండేళ్లుగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్‌లోని లక్ష ముప్పై వేల మంది ఓటర్లపై సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన అన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ప్రజలపై రేవంత్ రెడ్డి దుష్పరిపాలన మాత్రమే ప్రభావం చూపుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, వ్యాపారాలు నష్టపోయాయని, అరాచకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు బెదిరింపులకు గురవుతున్నారని, పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఉపాధి కల్పన జరగడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇవన్నీ హైదరాబాద్‌లోని ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలుగా ఆయన అభివర్ణించారు.
