Kotamreddy Sridhar Reddy: మంత్రి పదవిపై మనసులోని మాట చెప్పిన కోటంరెడ్డి
టీవీ9 క్రాస్ ఫైర్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిపై తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కడా ప్రకటించలేదని, ప్రస్తుత చర్చ అప్రస్తుతమని వివరించారు. అయితే, నిజాయితీగా మంత్రి పదవి కోరుకుంటున్నానని తెలిపారు. .. ..
టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో, ఆయన మంత్రి పదవిపై తన కోరికను వెల్లడించారు. చంద్రబాబునాయుడు గారు మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కడా ప్రకటన చేయలేదు అని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ” నారాయణ, ఆనం లాంటి నెల్లూరు జిల్లా నేతలు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఎవరో ఒకరిని పీకేస్తేనే మీకు ఇవ్వాలి?” అని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ప్రశ్నించారు. ఆయన సమాధానం ఈ వీడియోలో…
