Watch: మద్యం మత్తులో యువతి హల్‌చల్.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించిందిగా..
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మద్యం సేవించిన యువతి రోడ్డుపై అల్లరి చేసింది. బార్ నుండి బయటకు వచ్చి యువకులతో గొడవ పడింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో వారితో కూడా యువతి గొడవ పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్‌నెట్ వేదికగా పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేసింది. ఫుల్‌గా దాగి బార్ నుంచి బయటకు వచ్చి యువతి యువకులు రోడ్డుపై గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. పోలీసులు మహిళలతో దురుసుగా ప్రవర్తించారని గొడవకు దిగారు. పోలీసులు గొడవను అదుపు చేయాలని ప్రయత్నించిన వారు మద్యం మత్తులో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ అంశంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Published on: Jul 08, 2025 08:51 PM