Covid Crisis Support: తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్..ఎక్కడ..ఎలా?(వీడియో)

|

Oct 10, 2021 | 9:57 AM

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికించింది. దాదాపు అన్ని రంగాలపైనా తీవ్రప్రభావం చూపించింది. ఎందరో తమకుటుంబ సభ్యులను, ఆత్మీయులను కోల్పోయారు. అభంశుభం తెలియని పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికించింది. దాదాపు అన్ని రంగాలపైనా తీవ్రప్రభావం చూపించింది. ఎందరో తమకుటుంబ సభ్యులను, ఆత్మీయులను కోల్పోయారు. అభంశుభం తెలియని పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారికి కోవిడ్‌ క్రైసిస్‌ సపోర్ట్‌ పేరుతో స్కాలర్ షిప్ ను ప్రకటించింది.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 1 వ తరగతి నుండి పోస్టు గ్రెడ్యుయేషన్ వరకూ 15 వేల నుండి 75 వేల రూపాయల వరకూ వారికి స్కాలర్షిప్ ను అందించనుంది. ఈ స్కాలర్ షిప్ కోసం అక్టోబరు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం మీరు బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ www.buddy4study.com లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అయితే దీనికి అర్హులు ఎవరు అంటే.. కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. వీరి కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు.

దీనికి అప్లై చేసుకోడాని www.buddy4study.com లోకి వెళ్లి దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఈ–మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి.. అడిగిన డాక్యుమెంట్స్ ని ఎటాచ్‌ చేయాలి. తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు, గతేడాది మార్కుల లిస్ట్, స్కూల్ అడ్మిషన్ లెటర్, స్కూల్ ఫీ రిసిప్ట్, వీటితో పాటు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీచర్ లేదా డాక్టర్ నుంచి ఆర్ధిక పరిస్థితికి సంబంధించిన రిఫరెన్స్ లెటర్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లికేషన్ ఫీల్ చేసే సమయంలో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ కు ఎంపికయిన విద్యార్ధులకు ఒక ఏడాదికి ఒకేసారి స్కాలర్ షిప్ గా మనీ మొత్తం ఇస్తారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Maa Elections 2021: నాగబాబు వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్.. రేపటి పోరులో ఎం జరగనుంది..(లైవ్ వీడియో)

 Road accidents: ప్రాణదాతలకు 5 వేలు పారితోషికం.. కేంద్రం కొత్త పథకం..! వివరాలు ఇలా..(వీడియో)

 CVL Narasimha Rao on Maa Elections 2021: క్లైమాక్స్‌కు చేరుకున్న’మా’.. సీవీఎల్‌ నరసింహరావు మరో సంచలన నిర్ణయం..

 Pawan Kalyan-Janasena-Telangana: జై తెలంగాణ అంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. క్రమశిక్షణకు మారుపేరుగా జనసేన..(లైవ్ వీడియో)

Published on: Oct 10, 2021 09:28 AM