TTD Offer Video: హాలిడేస్ వస్తున్నాయి.. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక ప్రకటన..(వీడియో)

Updated on: Mar 18, 2022 | 9:29 AM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది. అదేవిధంగా, ఈ సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. అయితే వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శనం క‌ల్పించ‌డంతోపాటు ప్రసాదాలు అందించ‌డం జ‌రుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Loading...
Unable to load recommendations.
Follow Us