BRS: తెలంగాణ పాలిటిక్స్ లో కవిత Vs హరీష్ రావు

Updated on: Sep 02, 2025 | 8:01 PM

బీఆర్‌ఎస్‌లో కవిత వ్యవహారం..క్యాడర్‌ వర్సెస్‌ క్యాడర్‌గా మారింది. నిన్నటివరకూ బీఆర్‌ఎస్‌లో ఒక్కటిగా ఉన్న జాగృతి శ్రేణులు..కవితపై సస్పెన్షన్‌ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. జాగృతి కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగిన కార్యకర్తలు.. హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంటే స్పందించని పార్టీని నిందిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. కవిత మాటలను వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారని మండిపడుతున్నారు జాగతి కార్యకర్తలు.

జాగృతి కార్యకర్తల ఆరోపణలకు అంతే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు హరీష్‌రావు అనుచరులు. సిద్దిపేటతో సహా పలు చోట్ల కవిత ప్లెక్సీలను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల్లోని కవిత ఫోటోలను తొలగించారు. కవితకు కుటుంబం కంటే డబ్బంటేనే ప్రేమని..గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో అనేక సెటిల్‌మెంట్లు చేశారని ఆరోపిస్తున్నారు. కవిత చేసిన లిక్కర్‌ స్కామ్‌వల్ల బీఆర్‌ఎస్‌కు చెడ్డపేరు వచ్చిందని మండిపడుతున్నారు.