డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..

Updated on: Oct 10, 2025 | 4:10 PM

పిల్లలతో కలిసి సరదాగా గడపాలని ఉల్లాసంగా ఇంట్లోంచి బయలుదేరిన ఒక కుటుంబానికి కర్ణాటకలోని తుమకూరు జిల్లా మర్కోనహళ్లి డ్యామ్ వద్ద దారుణ విషాదం ఎదురైంది. పండుగ వాతావరణంలో జరుపుకోవాలనుకున్న పిక్నిక్.. ఊహించని మృత్యుఘోషగా మారింది. డ్యామ్‌లోని గేట్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా దూసుకువచ్చి ఏడుగురు వ్యక్తులను ముంచేసింది.

ఇందులో ఒకే ఒక్క వ్యక్తి స్థానికులు కాపాడగా, మిగతా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అందరూ మహిళలు, చిన్నారులే కావటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. పిక్నిక్ కోసం సుమారు 15 మంది సభ్యులు డ్యామ్ ప్రాంతానికి వచ్చారని తుమకూరు జిల్లా ఎస్‌పీ అశోక్ తెలిపారు. వీరిలో ఏడుగురు నీటిలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అకస్మాత్తుగా డ్యామ్‌లోని సైఫన్ సిస్టమ్ తెరుచుకోవడంతో.. భారీగా నీరు దిగువకు దూసుకొచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే, ఉత్సాహంగా నీటిలో స్నానాలు చేస్తున్న వారంతా .. దానిని గుర్తించకపోవటంతో.. క్షణాల వ్యవధిలోనే ఆ ఏడుగురు.. నీటి ఉద్ధృతి దిగువకు కొట్టుకుపోయారని ఆయన తెలిపారు. అయితే.. ఈ ఘటనను చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో వారు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నవాజ్ అనే ఓ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకు రాగలిగామని, అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్‌ సిగ్నల్‌

విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్

భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు

ఫస్ట్ టైం లాటరీ టికెట్ కొని.. పాతిక కోట్లు గెలిచిన పెయింటర్

రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. రైలు టికెట్లు రద్దు చేయాల్సిన పనిలేదు