కూరలో వయాగ్రా మాత్రలు కలిపి.. ఫెయిల్ కావడంతో వీడియో
కరీంనగర్‌లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధాల కారణంగా భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్న భార్య మౌనిక, మొదట కూరలో వయాగ్రా మాత్రలు కలిపి విఫలమైంది. అనంతరం నిద్రమాత్రలు కలిపి స్పృహ తప్పించి, ఉరి వేసి చంపింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ జిల్లాలో వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఓ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. సప్తగిరి కాలనీకి చెందిన కత్తి సురేష్‌ను అతని భార్య మౌనిక హత్య చేసింది. గత కొంతకాలంగా మౌనిక చెడు అలవాట్లకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సురేష్‌ను చంపాలని ప్లాన్ చేసిన మౌనిక, తన బంధువులు, స్నేహితుల సహాయం తీసుకుంది.
మొదట, మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ సలహా మేరకు 15 వయాగ్రా మాత్రలను కూరలో కలిపింది. సురేష్‌కు కూర రుచి తేడాగా అనిపించడంతో భోజనం చేయకుండా వెళ్లిపోయాడు. మొదటి ప్రయత్నం విఫలమవడంతో, మౌనిక రెండో ప్లాన్ అమలు చేసింది. బీపీ, నిద్రమాత్రలను చూర్ణం చేసి మధ్యంలో కలిపి సురేష్‌కి ఇచ్చింది. అది తాగిన తర్వాత సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, మౌనిక చీరతో ఉరి బిగించి హత్య చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
