చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు.. హోంగార్డ్ ఈవెంట్స్‌లో అదరగొట్టిన మహిళ
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హోంగార్డు నియామక ట్రయల్‌లో ఓ మహిళ చీరకట్టులోనే 1,600 మీటర్ల పరుగు పూర్తి చేసింది. కాళ్లకు షూస్ లేకపోయినా, మండుతున్న ఎండను లెక్కచేయకుండా నడుముకు చీరను బిగించి పరుగెత్తింది. పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని చూసి మైదానంలో ఉన్న అధికారులు, తోటి అభ్యర్థులు చప్పట్లతో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సకల సౌకర్యాలు, ట్రాక్ డ్రెస్సులు, రన్నింగ్ షూస్ ఉన్నా కొందరు రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్‌లో పరుగు పూర్తి చేయలేక వెనకబడిపోతుంటారు. కానీ పట్టుదల, లక్ష్యం ఉంటే ఏదీ అడ్డంకి కాదని నిరూపించింది ఓ మహిళ. కాళ్లకు షూస్ లేవు, అనువైన పరుగు దుస్తులు లేవు, పైగా మండుతున్న ఎండ.. అయినా సరే, కట్టుకున్న చీరను నడుముకు బిగించి ఏకంగా 1,600 మీటర్ల రన్నింగ్ రేస్‌ను పూర్తి చేసి నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేసింది. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో 284 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్, వితంతువులు మరియు విడాకులు తీసుకున్న వారికి అదనంగా 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. దీంతో స్థానిక మహిళలు ఉద్యోగాల కోసం భారీగా పోటీ పడ్డారు. రామ్‌గఢ్‌లోని సిద్ధో-కాన్హూ మైదానంలో నిర్వహించిన ట్రయల్ రన్‌లో పాల్గొన్న ఓ మహిళ చీరకట్టులోనే మైదానంలోకి దిగింది. అంతేకాకుండా, ఎందరో యువతులను వెనక్కి నెట్టి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మహిళ పరుగు పూర్తి చేయగానే మైదానంలో ఉన్న తోటి అభ్యర్థులు, అధికారులు చప్పట్లతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కుటుంబ ఆశలను నిలబెట్టాలనే ఆమె ఆత్మవిశ్వాసానికి, సంకల్పానికి అందరూ సలాం చేస్తున్నారు. చీరకట్టులోనే పరుగెత్తి అర్హత సాధించిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండో అంతస్తునుంచి పడిపోయిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు!
ఏఐతో పెను ప్రమాదం తప్పదు.. ఓపెన్ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
విద్యుత్ వినియోగదారులకు షాక్.. తెలంగాణలో పెరిగిన కరెంట్ ఛార్జీలు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన

