Ghee Coffee: కొవ్వు తగ్గాలంటే ఘీ కాఫీ

|

Oct 25, 2024 | 1:37 PM

ఘీకాఫీ తాగిన తర్వాత ఫుడ్ తీసుకుంటే.. ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుందట. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ నేతికాఫీని ఎంచక్కా తాగొచ్చని చెబుతున్నారు. అలాగే యువతులు, మహిళల్లో ఇప్పుడు హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా PCOD,PCOS వంటి సమస్యలతో సఫర్ అవుతున్నారు ...అలాంటి వారు కూడా ఈ నేతి కాఫీని తాగితే రోజంతా యాక్టివ్ గా ఉంటారని కూడా నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి.. ఇతర ఆహారాలను తినాలన్న కోరిక తగ్గుతుంది. అంతేకాదు పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందట కూడా. తాజాగా నెయ్యి కాఫీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు నిపుణులు. శరీరంలో కొవ్వు తగ్గడానికి షార్ట్ కట్ లు లేవన్నది వారి మాట. బరువు తగ్గాలంటే ఆహారం తీసుకునే విషయంలో తెలివిగా ఉండాలని చెబుతున్నారు. ఆహారం తీసుకోవడమే కాదు.. శారీరక కదలికలు కూడా మెరుగ్గా ఉండాలని, లోతైన శ్వాస వ్యాయామాలు కూడా ఇందుకు దోహదపడతాయంటున్నారు. తేలికగా బరువు తగ్గాలనే ఆలోచనతో షార్ట్ కట్ మార్గాలను అనుసరించడం, సోమరితనాన్ని పెంచే దిశగా ఆలోచించడం మానేయడం మంచిదని హితవు పలుకుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌ బాస్‌లో.. టెర్రర్ పుట్టించిన గంగవ్వ దెబ్బకు కంటెస్టెంట్స్‌ హడల్

తన భార్యపై వెకిలి కామెంట్స్‌ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ

మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్‌ ప్రశంసలు

Ram Charan: రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న చరణ్.. టాలీవుడ్‌లో ఇంత కాస్ట్రీ వెహికల్ మరెవరికీ లేదట !!

42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??